Sunday, 13 September 2026 12:10:31 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Date : 27 July 2026 08:32 PM Views : 92

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటుగా పోషక విలువలతో కూడిన బలమైన ఆహారాన్ని అందించేందుకు సీఎం అల్పాహార కార్యక్రమాన్ని చేపట్టిందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం కేంద్రమైన మధిర విజయవాడ రోడ్ లో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డులో "హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్" ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ వంటగదినిలాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మధిర మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన సభకు ఉపముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ వంటగది ద్వారా ప్రభుత్వ పాఠశాలల పేద విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన, బలమైన ఆహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.సమాజంలోని బలహీన వర్గాలకు ఈ బ్రేక్ ఫాస్ట్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఉచిత పథకాలు అనేవి ఈ రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం పెట్టే పెట్టుబడి అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టంగా ప్రకటించారు. మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియక చాలామంది ఉచిత పథకాల పైన విమర్శ చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పరిశ్రమలు ప్రాజెక్టులు ఇతర అనేక అంశాలపై ప్రభుత్వం పెట్టుబడి పెట్టినట్లుగానే పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి పైన ప్రభుత్వం పెట్టుబడి పెడుతుందని ఆయన అన్నారు. ఈ పెట్టుబడి ఫలితాలు ప్రజలు అభివృద్ధి చెంది ఆర్థికంగా, సామాజికంగా ముందుకు వెళ్లేందుకు దోహదం చేసేవిగా ఉంటాయన్నారు.మధిర నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పోషకాహార అల్పాహారాన్ని అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పుట్టిన ఏ బిడ్డ కూడా అర్ధాకలితో పాఠశాలకు వెళ్లకూడదన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన ఆశయమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లల శారీరక, మానసిక వికాసం కోసం ఉదయమే రుచికరమైన, శుచి-శుభ్రతతో కూడిన పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. బడ్జెట్‌లో ప్రకటించిన విధంగానే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత అల్పాహార పథకాన్ని మధిర నియోజకవర్గంలో ప్రారంభించినట్లు చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ఏ బిడ్డ కూడా అర్ధాకలితో పాఠశాలకు పోరాదన్నారు. ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ, రాష్ట్ర భవిష్యత్తు ఆని ఆయన చెప్పారు వారి భవిష్యత్తే మన భవిష్యత్తు అన్నారు. అటువంటి బిడ్డల భవిష్యత్తు కోసం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంతృప్తికరంగా ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేసి చదువుకోవాలని అన్నారు. రుచికరమైన, శుచి శుభ్రతతో కూడిన న్యూట్రీషియస్ ఫుడ్ ని మనం అందించాలని చెప్పి ఈ క్యాబినెట్ చేసిన నిర్ణయం మేరకు బడ్జెట్ లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన చెప్పారు. మానవ వనరులు మన రాష్ట్ర సంపద. ఏ రాష్ట్ర అభివృద్ధికైనా సహజ వనరులు ఎంత అవసరమో సమర్థవంతమైన మానవ వనరులు కూడా అంతే అవసరమని భట్టి విక్రమార్క నొక్కి వక్కాణించారు. అత్యంత ప్రతిభావంతులు తయారైనటువంటి మానవ వనరులు ఉన్నటువంటి రాష్ట్రం గాని, దేశం గాని ప్రపంచంలో అత్యంత శక్తివంతంగా మారుతుందని ఆయన అన్నారు. రాష్ట్రానికే కాదు దేశానికి, ప్రపంచానికి కూడా దశా దిశా నిర్దేశంచేయగలిగినటువంటి మానవ వనరులను సానబెట్టిన వజ్రాల్లాగా ప్రపంచం మీదికి మనం వదిలి పెట్టగలగాలన్నారు. అటువంటి వజ్రాల్ని తయారు చేసుకోవాల్సిన తరుణంలో ఉదయం అల్పాహార పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా మొదలుపెట్టే కార్యక్రమానికి నాంది పలికామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులకి ఒకటే సమయానికి వేడిగా అల్పాహారం అందించడం అంటే ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అన్నారు. ఈ దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లెక్కించాల్సిన అంశమని అన్నారు. సాధారణంగా ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలకు సమయానికి టిఫిన్ కట్టడమే తల్లిదండ్రులకు కష్టంగా మారిన రోజులివి. అలాంటిది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 20 లక్షల మంది, రెసిడెన్షియల్ స్కూళ్లలోని 7 లక్షల మంది పిల్లలతో కలిపి మొత్తం 27 లక్షల మందికి ఒకేసమయానికి వేడివేడిగాఅల్పాహారం అందించడం దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన అంశంమని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ, ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద ఎత్తున అల్పాహారం అందించే వ్యవస్థ లేదని భట్టి పేర్కొన్నారు. సంకల్పం మంచిదైతేభగవంతుని ఆశీస్సులు ఉంటాయని, అందుకే సాధ్యం కాదనుకున్న ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రభుత్వం సాధ్యం చేసి చూపిందని ఉప ముఖ్యమంత్రి సీఎం హర్షం వ్యక్తం చేశారు. హరే కృష్ణ మిషన్ భాగస్వామ్యంతో పకడ్బందీగా, అత్యంత శుభ్రమైన వాతావరణంలో మెకనైజ్డ్ కిచెన్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం మధిరలోని తాత్కాలిక సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా 16 మండలాల స్కూళ్లకు వాహనాల్లో అల్పాహారం అందిస్తున్నామని అన్నారు. రాబోయే 3 నెలల్లో. రాష్ట్రవ్యాప్తంగా శాశ్వత కిచెన్ నిర్మాణాలను పూర్తి చేసి విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారాన్ని అందించనున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. పిల్లలకు అందించే అల్పాహారంతో పాటు పౌష్టికాహారం కోసం వారానికి 3 రోజుల పాలు, మరో 3 రోజులు రాగి జావను ప్రత్యేకంగా అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని వారి కోసం రూ. 5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. గృహ ప్రవేశానికి మనం వెళ్ళినప్పుడు ఆ పేదవాళ్ల కళ్లల్లో ఆనందం చూస్తే.. ఇది కదా పాలన అనే అనుభూతి కలుగుతోంది. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసిన 'పీపుల్స్ మార్చ్' పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను కళ్లారా చూశానని భట్టి విక్రమార్క చెప్పారు. ఈ సమయంలో బడుల దుస్థితి, నిరుద్యోగుల ఆవేదన, ఇల్లు లేని పేదల బాధలను విన్నానని చెప్పారు. ఆనాడే నా మనసులో రూపుదిద్దుకున్న ఆలోచనలే నేడు ఒక్కొక్కటిగా పథకాలుగా మారుతున్నాయని భావోద్వేగానికి లోనవుతూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ₹22,500 కోట్లతో మొదటి విడతలోనే 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేశాం. మహాలక్ష్మి పథకంతో సగం జనాభా ఉన్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్నాం అన్నారు. మహిళలను కోటీశ్వరులను చేసేందుకు బ్యాంక్ లింకేజీ ద్వారా ఇప్పటికే ₹67,000 కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చాం. పేద కుటుంబ వైద్య పరిమితిని ఏకంగా ₹10 లక్షలకు పెంచాం. కోటి 6 లక్షల కుటుంబాలకు నెలకు మనిషికి 6 కేజీల చొప్పున సన్న బియ్యాన్ని అందిస్తున్నాం. కేవలం 9 రోజుల్లోనే ₹9,000 కోట్ల నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి మధిర మున్సిపాలిటీ చైర్పర్సన్ సామినేని సుజాత మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు కమిషనర్ సామ్యూల్ పాల్ ఎంఈఓ మురళీధర్ రావు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :