Wednesday, 29 July 2026 12:43:31 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

మహిళోద్ధరణకు కృషి చేసిన మహానీయుడు జ్యోతిరావు ఫూలే...

మంథనిలో ఘనంగా పూలే వర్ధంతి వేడుకలు

Date : 28 November 2025 05:34 PM Views : 306

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం మంథని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించినారు. ఈ సందర్భంగా మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ మాట్లాడుతూ, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులు పొందడానికి సత్య శోధక్ సమాజ్ ను ఏర్పాటు చేసి అన్ని మతాలు, కులాల ప్రజలను చేర్చుకొని సామాజిక సంస్కరణ ఉద్యమంలో పూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డారని అన్నారు. జ్యోతిరావు పూలే, సావిత్రి భాయి పూలే భారతదేశంలో బాలికల కోసం పూణేలో 1848లో ఒక పాఠశాలను ప్రారంభించారన్నారు. అంతేగాకుండా విద్య యొక్క విశ్వీకరణను సమర్ధించిన మొదటి సంస్కర్త కూడా పూలే అని అన్నారు. జ్యోతిరావు పూలేకు చిన్నప్పటి నుంచి శివాజి అంటే అభిమానం ఎక్కువని శివాజి, జార్జ్ వాషింగ్టన్ జీవిత చరిత్రలు ప్రభావితం చేయడం వల్ల దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవాటయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు మంథని సత్యనారాయణ, ,పేరవేన లింగయ్య, ఊదరి శంకర్, ఆరేళ్లి కిరణ్ గౌడ్,చంద్రు రాజమల్లు, దొరగోర్ల శ్రీనివాస్, ఎరుకల ప్రవీణ్,కొత్త శ్రీనివాస్, మంథని శ్రీనివాస్, బాలాజీ, మబ్బు తిరుపతి, భూడి ద రంజిత్, ఎరుకల రమేష్ బాబు, ఫయీo, ఇల్లుటo రమేష్, పసుల ప్రసాద్, తాళ్ల సత్యనారాయణ, సవాయి గణేష్, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :