Thursday, 15 January 2026 05:41:19 PM
# చిదినేపల్లి పంచాయతీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి # రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా భోగి వేడుకలు.. # ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్‌లో ఫోన్లు లాక్కొని విద్యార్థినుల నిర్బంధం # శ్రీ గోదా దేవి రంగనాథ కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న కోనేరు కోనప్ప.. # రాజురా లో ఘనంగా ముగ్గుల పోటీలు.. # ముగ్గులు భారతీయ మహిళల సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనం... # విద్యార్థిని మృతదేహానికి నివాళులు అర్పించిన పట్లోల చంద్రశేఖర్ రెడ్డి # భూ భారతి చలాన్ల స్కామ్‌లో అధికారుల పాత్ర పై దర్యాప్తు ముమ్మరం... # రోడ్డు భద్రత, నేరాల నియంత్రణపై అవగాహన కల్పించిన ఆత్మకూరు డిఎస్పి- ఆర్.రామాంజి నాయక్ # అయ్యప్ప వాడలో భోగి మంటలు కార్యక్రమం # సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన టిడిపి యువ నాయకుడు పి.హుసేన్ భాష # రక్తదానంపై అపోహలు వద్దు- రక్త దానం చేసిన లింగాల గ్రామ యూత్ ను అభినందించిన ఎస్ఐ- పి.తిరుపాలు # శ్రీపాద కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించిన మూల సరోజన పురుషోత్తం రెడ్డి # మోహన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బీరెల్లి రజిని కుమార్ # సరస్వతి అంత్య పుష్కరా లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి # మన భారత దేశ ప్రజలందరికీ పేరుపేరునా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు # కించపరిచే ఆరోపణలపై సిట్ ఏర్పాటు.. # పండగలు సంతోషంగా జరుపుకోవాలని మా లక్ష్యం # రోడ్డు భద్రత కేవలం పోలీస్ బాధ్యత మాత్రమే కాదు… ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత... # ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను త్వరితగతిన నిర్మించాలి...

మునిసీపల్ ఎన్నికలకు జనసేన పార్టీ సై...

Date : 13 January 2026 10:27 PM Views : 20

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో / కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన పార్టీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని మొన్న కొండగట్టుకు వచ్చిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తినిరేపుతోంది. తెలంగాణలో పార్టీని బలో పేతం చేసే దిశగా అడుగు లు వేస్తున్న జనసేన ఇప్పటికే కొత్త అడ్ హాక్ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, జనసేన తనకు పట్టు ఉన్న ప్రాంతాల్లోనే పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే బీజేపీ, టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన, అదే ఫార్ములాను తెలం గాణలో కూడా అమలు చేస్తుందా? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా మారింది. తెలంగాణలో బీజేపీతో పొత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ బీజేపీ నేతలు జనసేనతో పొత్తు లేదని స్పష్టంగా చెబుతున్నా, రాజకీయాల్లో చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చన్న అభిప్రాయం ఉంది. పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో చూస్తే జనసేన, బీజేపీ మధ్య సాన్నిహిత్యం ఉంది. అందువల్ల జాతీయ స్థాయిలో చర్చలు జరిగి, తెలంగాణలోనూ పొత్తు కుదిరితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో జనసేన ఇప్పటికీ పూర్తిస్థాయి రాజ కీయ శక్తిగా ఎదగలేదు. అయినా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఇమేజ్, యువత లో ఉన్న క్రేజ్ కారణంగా పార్టీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇదే బలంగా చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో అడుగుపెట్టాలని జనసేన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో క్రమంగా బలమైన పట్టు సాధిస్తున్న జనసేన, అదే ప్రభావాన్ని తెలంగాణలో కూడా చూపగలదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జనసేన తెలంగాణ లో బీజేపీతో పొత్తు పెట్టు కుంటే ఎక్కువ స్థానాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓటు చీలిక తగ్గడం తో పాటు, పార్టీకి గుర్తింపు మరింత పెరుగుతుందని అంటున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే, ఆశించిన స్థాయి పనితీరు ఉండకపోవచ్చన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక బలం, క్యాడర్ కీలకం కావడంతో, కొత్తగా రంగంలోకి దిగుతున్న పార్టీలకు సవాల్ తప్పదని అంటున్నారు. జనసేన పోటీ కేవలం స్థానిక ఎన్నికల వరకే పరిమితమా? లేక రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు అడుగులా అన్న ప్రశ్నలకు త్వరలోనే సమా ధానం దొరుకుతుందేమో చూడాలి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :