Sunday, 13 September 2026 01:35:46 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

హైదరాబాద్- విజయవాడ రహదారికి మార్గం సుగమం..

Date : 02 September 2026 08:27 PM Views : 50

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు వెళ్లే జాతీయ రహదారి-65కు భారీ అప్‌గ్రేడ్‌కు మార్గం సుగమమైంది. మొత్తం 285 కిలోమీటర్ల మేర రహదారిని ఆరు వరుసలుగా అభివృద్ధి చేసే ప్రతి పాదనకు పబ్లిక్- ప్రైవేట్ పార్టనర్‌షిప్ అప్రైజల్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.12,07 3.99 కోట్లుగా అంచనా వేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టనున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత ఆందోల్ మైసమ్మ ఆలయం సమీపం నుంచి విజయవాడ గొల్లపూడి వరకు 181 కిలోమీటర్ల మార్గాన్ని తొలి ప్యాకేజీగా అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ నుంచి నందిగామ వరకు 45 కిలోమీటర్ల భాగం రెండో ప్యాకేజీలో, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 59.69 కిలోమీటర్ల మార్గం మూడో ప్యాకేజీలో ఉంటుంది. అధికారుల అంచనా ల ప్రకారం తొలి ప్యా కేజీకి రూ.7,321.97 కోట్లు ఖర్చవుతాయి. రెండో ప్యాకేజీకి రూ.2,965.11 కోట్లు, మూడో ప్యాకేజీకి రూ.1,786.91 కోట్ల వ్యయం అవుతుం దని అంచనా వేశారు. భూసే కరణ, రహదారి నిర్మాణం, జీఎస్టీ తదితర అన్ని వ్యయాలను కలిపితే ఒక్కో కిలోమీటరుకు సగటున రూ.38 కోట్ల వరకు ఖర్చు కానుంది. తెలంగాణలో యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా ఈ రహదారి సాగుతుం ది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్, కృష్ణా జిల్లా ల పరిధిలో పనులు కొనసాగనున్నాయి తెలంగాణ పరిధిలోని రెండు ప్యాకేజీలకు సంబంధించి భూసేకరణ కోసం రూ.1,453.88 కోట్ల వరకు అవసరమవు తుందని అంచనా వేశారు. ఈ రెండు ప్యాకేజీల కు కలిపి 1,387.628 హెక్టార్ల భూమి అవసరం కాగా ఇప్పటికే 1,174.295 హెక్టార్ల భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఇంకా 213.33 హెక్టార్ల భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉంటుంది. ఇక విజయవాడ- మచిలీపట్నం విభాగంలో 351.185 హెక్టార్ల భూమి అవసరం కాగా 344.685 హెక్టార్లు అందుబాటు లో ఉంది. దీంతో అదనంగా సుమారు 6.50 హెక్టార్ల భూమి ని సేకరించాల్సి ఉంటుంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :