Monday, 14 September 2026 06:35:06 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

మహిళా సిబ్బంది అన్ని రకాల విధులకు సంసిద్ధమై ఉండాలి...

ఎస్పీ అఖిల్ మహాజన్

Date : 25 February 2026 11:03 PM Views : 294

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహిళా సిబ్బందికి ఆత్మస్థైర్యాన్ని పెంచేలా చేసి, అన్ని రకాల పరిస్థితులలో, విధులలో సంసిద్ధంగా ఉండేలా కఠినమైన శిక్షణ అందించనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం తెలిపారు . మూడు రోజులపాటు మహిళా సిబ్బందికి మార్షల్ ఆర్ట్స్ మరియు కరాటే, లాఠీ డ్రిల్ లాంటి వాటిపై పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో శిక్షణను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా సిబ్బందికి నిష్ణాతులైన కరాటే మాస్టర్ ముకేష్ చే శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశ్యం మహిళా సిబ్బందిని శారీరకంగా, మానసికంగా మరియు వృత్తిపరంగా మరింత దృఢంగా తీర్చిదిద్దడం ప్రస్తుత కాలంలో మహిళా పోలీసులపై పెరుగుతున్న బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని స్వీయ రక్షణ నైపుణ్యాలతో పాటు చట్టపరమైన అవగాహన, ప్రవర్తనా పద్ధతులు, సంఘటన స్థలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్ర శిక్షణ అందించడం జరుగుతుందన్నారు.శిక్షణలో భాగంగా లాఠీ డ్రిల్, కరాటే, ప్రాథమిక స్వీయ రక్షణ చిట్కాలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానం వంటి అంశాలపై ప్రాక్టికల్ సెషన్లు నిర్వహిస్తారు. ఆకతాయిలు, పోకిరిల ఆగడాలకు సమర్థంగా ఎదుర్కొనే ధైర్యం, నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యంగా శిక్షణ కొనసాగనున్నది. ఖైదీలు, నేరస్తులతో వ్యవహరించే సమయంలో పాటించాల్సిన నియమాలు, మహిళా ఖైదీల భద్రత, పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశారు. అదనంగా శాంతిభద్రతల సమస్యలు, ధర్నాలు, ర్యాలీలు, ఉత్సవాల సమయంలో మహిళా సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులపై వ్యూహాత్మక శిక్షణ అందించడం జరుగుతుంది. ఆత్మస్థైర్యాన్ని, మానసిక ధైర్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు జరగనున్నట్లు తెలిపారు. మహిళా సిబ్బంది పురుష సిబ్బందితో సమానంగా అన్ని రకాల విధుల్లో సమర్థంగా పాల్గొనేలా తీర్చిదిద్దడమే ఈ శిక్షణ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా సిబ్బంది స్వీయ రక్షణతో పాటు సమాజ రక్షణలో కీలకపాత్ర పోషిస్తూ పోలీస్ శాఖకు గౌరవం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పరిపాలన పి మౌనిక, ఏఆర్ డి.ఎస్.పి కమతం ఇంద్రవర్ధన్, పట్టణ సిఐలు బి సునీల్ కుమార్, కె నాగరాజు, ప్రేమ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి వెంకటి, ప్రైవేట్ మహిళ కరాటే మాస్టర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: