ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వానాకాలం 2026-27 సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు కొరకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు తెలిపారు . సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళలతో కలిసి జిల్లా గిరిజన అభివృద్ధి సంస్థ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, మెప్మా, డి సి ఎం ఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం 2026- 27 కు సంబంధించి జిల్లాలో అవసరమైన గోదాములను గుర్తించి సిద్ధం చేయాలని, సంబంధిత ఏజెన్సీ లతో సన్నాహక సమావేశాలు నిర్వహించి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తైన ప్రదేశాలలో చదునుగా ఉండే ప్రాంతాలలో ఏర్పాటు చేసేలా చూడాలని, జిల్లాలో అక్టోబర్ 1వ తేదీ నాటికి సంబంధిత ఏజెన్సీలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలు సమకూర్చుకొని సిద్ధంగా ఉండాలని, అక్టోబర్ 1వ తేదీలోగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి పి సి ఎస్ ఎ పి అప్లికేషన్ లో 16 ప్రశ్నలకు రియల్ టైం ఫొటోస్ నమోదు చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల రీ కన్ఫ్లేషన్ త్వరితగతిన పూర్తి చేయించాలని, వానాకాలం సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆన్ లైన్ ప్రకారం ట్రక్ షీట్స్ జనరేషన్, గోనె సంచుల నిర్వహణ, లారీలకు జియో టాగింగ్ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టేలా అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేయాలనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారుల తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News