ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విబి-జి రాంజి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని రోజువారీ కూలీలకు నిరంతరం పని కల్పించాలని, ప్రతి కూలీకి రోజుకు కనీసం రూ. 300 ఉపాధి వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని సూర్యాపేటజిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్పష్టం చేశారు. మంగళవారం తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ఎంపీడీవోలు, ఎంపీఓలు, విబి జి రాంజీ సిబ్బంది మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబంది, అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కూలీల సంఖ్యను పెంచాలన్నారు. రోజుకు రూ. 300 దక్కాలి, గ్రామీణ ప్రాంతాల్లో లేబర్ మొబిలైజేషన్ (కూలీల సంఖ్య) ను తక్షణమే పెంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) పథకం కింద మంజూరైన ఇందిరమ్మ మరుగుదొడ్ల నిర్మాణాలు, వాటికి సంబంధించిన పేమెంట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వీటితో పాటు డ్రైన్ ఎండ్ సోక్ పిట్లు, వీఓ/ఎస్ హెచ్ జీ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ఎక్కడా జాప్యం జరగకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 16 మంది కార్యదర్శులకు షోకాజ్.. ముగ్గురు సిబ్బందిపై చర్యలు.. విధుల పట్ల నిర్లక్ష్యం వహించి, పనుల్లో అలసత్వాన్ని ప్రదర్శించిన 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డిఆర్డిఓ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే విబి జి రాంజీ సిబ్బందిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక ఏపీఓ , ఒక కంప్యూటర్ ఆపరేటర్ మరియు ఒక ఈసీలపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.కార్యక్రమంలో డిఆర్డిఓ సన్యాసయ్య జెడ్పి సీఈఓ డి శిరీష డిపిఓ యాదగిరి ఇతర అధికారులుతదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News