ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సంగారెడ్డి జిల్లానారాయణ ఖేడ్ మండలం ర్యాకల్ గ్రామానికి చెందిన ఐఐఐటి విద్యార్థిని పూజ నిన్న సంగారెడ్డి సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకొని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి బాదిత కుటుంబ సభ్యులను పరామర్శించి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని, ఆర్టీసీ సంస్థ ద్వారా వారికి నష్ట పరిహారం అందేలా చూస్తామని తెలిపారు. ఆయన వెంట సర్పంచ్ జానీ.మాజీ ఉపసర్పంచ్ జైపాల్ యాదవ్.రాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News