Monday, 14 September 2026 09:02:00 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

బీసీ గురుకులాలు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి...

Date : 28 April 2026 10:23 PM Views : 177

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గల మహాత్మా జ్యోతిబా పూలె బీసీ సంక్షేమ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ మరియు డిగ్రీ ప్రవేశాల కోసం తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ విద్యాలయాల సంస్థ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్మీడియట్ కోసం, అదే విధంగా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ సేరు శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా ఇంటర్ ఫలితాలు ఇలా వచ్చాయి... ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇంటర్మీడియట్ కళాశాలల్లో మా విద్యార్థులు అత్యద్భుతమైన ఫలితాలు సాధించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బాలుర ఉత్తీర్ణతా శాతం 91 ఉండగా బాలికల ఉత్తీర్ణతా శాతం 96 గా నమోదైనట్టు ఆర్సీఓ తెలిపారు. దరఖాస్తు వివరాలు.. ఏప్రిల్ 22 వ తేదీ నుండి మే 12 వ తేదీ వరకు ఆన్లైన్ విధానం ద్వారా https:mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము రూ. 200 ఆన్లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది. పదవ తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది. బీసీ గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు ఆయా పాఠశాలల్లోని ప్రిన్సిపాల్ లకు దరఖాస్తు అందజేయాలన్నారు . మళ్ళీ ఆన్లైన్ లో దరఖాస్తు చెయ్యాల్సిన అవసరం లేదన్నారు. బీసీ గురుకుల విద్యార్థులకు 50 శాతం మరియు ఇత రపాఠశాల విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయించడం జరిగిందన్నారు. కోర్సుల వివరాలు ఇలా ఉన్నాయి... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ మరియు ఎంఈసీ కోర్సులలో సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలో నూతనంగా 4 కళాశాలలు మంజూరు చేశారన్నారు. కొత్తగా మంజూరైన సీట్లతో కలుపుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం వివిధ కోర్సులలో 2,320 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని కళాశాలలు ఇవే... జిల్లా బాలుర బాలికల ఆదిలాబాద్ 3,3,నిర్మల్4,3 మంచిర్యాల4 , 4 ఆసిఫాబాద్2,3 ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ కళాశాలలు ఇవే... మంచిర్యాల - పురుషుల నిర్మల్ - పురుషుల ఆదిలాబాద్ - మహిళల, ఆసిఫాబాద్ - మహిళ, ఆదిలాబాద్ మరియు ఆసిఫాబాద్ డిగ్రీ కళాశాలలు ఆదిలాబాద్ లోనే నిర్వహిస్తామన్నారు .ఈ విద్యాసంవత్సరం ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులు సంబంధిత కళాశాలలో లేదా సమీపంలోని మీ సేవ సెంటర్ ద్వారా ఆన్లైన్ లో https:mjptbcwreis.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్న డిగ్రీ కళాశాలల్లోని వివరాల కోసం క్రింది నంబర్లలో సంప్రదించాలన్నారు. మంచిర్యాల 9603705803, నిర్మల్ 9505520097, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ 8897602060. ఈ సదవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్ సి ఓ వివరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: