ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో గత మంగళవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అక్రమ అరెస్టులు, నిర్బంధాన్ని నిరసిస్తూ బుధవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని గాంధీచౌక్ వద్ద రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్బంగ సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూఒకవైపు ప్రజాపాలన అంటూ మరొకవైపు నిర్బంధ పాలన కొనసాగించడం సరైనది కాదన్నారు.ఈ అప్రజాస్వామికమైన విధానాన్ని నిర్బంధ పాలనను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మానుకోవాలన్నారు. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఆశా వర్కర్లు తగిన బుద్ధి చెప్తారని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఆశా యూనియన్ (సీఐటీయు) జిల్లా వర్కింగ్ అధ్యక్షురాలు శోభ మాట్లాడుతూరాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగించే లోపు ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18,000 లునిర్ణయించాలని,ఈపీఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని ఇతర డిమాండ్స్ అన్నింటిని పరిష్కరించాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఫిక్స్డ్ వేతనం రూ.18,000 లు నిర్ణయించకపోతే నిరవధిక సమ్మెకు వెళతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమం మద్దతుగా కనికరపు అశోక్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, పద్మ ఆశా యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ సభ్యులు, సునీత సువర్ణ లక్ష్మి మమత తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News