Friday, 11 September 2026 07:39:53 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు...

Date : 09 September 2026 08:37 PM Views : 26

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు అని పలువురు అధికారులు నాయకులు కొనియాడారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఘనంగా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన తెలుగు భాష గొప్పదనానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలకు కలెక్టర్ కుమార్ దీపక్ తో పాటు జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు ల తో కలిసి హాజరై కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంచిర్యాలజిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమం ప్రతిధ్వనిగా కాళోజినారాయణరావు తెలంగాణ ప్రజలందరికీ సుపరిచితులని అన్నారు. తెలంగాణ వైతాళికుడిగా జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని, తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమమే ఊపిరిగా జీవించాడని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతి రోజున తెలంగాణ భాషా దినోత్సవంగా వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. విద్యార్థి దశలోనే నిజాంను ఎదిరించి తెలంగాణలో విద్యా వ్యాప్తికి కృషి చేశారని, తన రచనలతో ప్రజలను చైతన్య పరుస్తూ ఆదర్శంగా నిలిచారని అన్నారు. కాళోజీ నారాయణరావు బహు బాషా కోవిదులు అని, కవిగా, రచయితగా తెలుగుతో పాటు వివిధ భాషలలో హ్యూమన్ రైట్స్, కుల వివక్ష లేని సమాజంపై రచనలు చేశారని తెలిపారు.మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి దిశగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాం, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్ రావు దేశ్ పాండే, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :