ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పూసల సంఘం భవనానికి రూ. 20 లక్షల నిధులు కేటాయించడం పట్ల ఆ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పూసల సంఘం రాష్ట్ర నాయకులు గుంటుపల్లి సమ్మయ్య ఆధ్వర్యంలో మంథని పూసల సంఘం నాయకులు హైదరాబాద్ లో ఐటి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుంటుపల్లి సమ్మయ్య, జిల్లా ఉపాధ్యక్షులు పట్టెం నరసయ్య, చేను రవి, కావేటి సమ్మయ్య, కావేటి శ్రీనివాస్, కావేటి రవి, గుడ్ల గురువేష్ లు పాల్గొన్నారు.
Admin
E Nivas News