ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కొమురం భీం జిల్లా దహేగం మండల కేంద్రంలోని గెర్రే గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ తలండి శ్రావణి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆదివాసీ సంఘాల అధ్వర్యంలో కొమురం భీం జిల్లాలో నీ అన్నిమండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టి తాసిల్దార్ ఎస్సై లకు వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం కొమురం భీం జిల్లా కలెక్టర్ ని కలిసి హత్యకు గురైన శ్రావణి గురించి వివరిస్తూ ప్రభుత్వం నుండి హర్థిక సహాయం మరియు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరారు. గురువారం కలెక్టరేట్ భవనంలో *కలెక్టర్ వెంకటేష్ దోత్రే మరియు జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్* కలిసి బాధిత కుటుంబాలకు *రూ. 4,12,500 అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, పొదుపు మహిళ సంఘాల ద్వారా రూ. 1,00,000 చెక్కు* రూపంలో అందజేశారు. మృతురాలి చిన్న తమ్ముడు తాలండి ప్రసిక్ ను Freshers రెసిడెన్షియల్ పాఠశాలలో 4వ తరగతిలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News