Tuesday, 28 July 2026 06:57:40 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ప్రజల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం...! ప్రజా వ్యతిరేక విధానాలను తీపి కొట్టాలి

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అలవాల వీరయ్య

Date : 18 January 2026 07:32 PM Views : 220

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రచార వ్యతిరేక విధానాల మూలంగా ప్రజల హక్కులు కాలరాయపడుతున్నాయని, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి అలవాల వీరయ్య అన్నారు. సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్, విబి రాంజీ చట్టం, జాతీయ విత్తన, నూతన విద్యుత్తు బిల్లు సవరణ రద్దుకై జిల్లా జీబు జాత మరిపెడ మండలంలోని గుండెపూడి , మరిపెడ(బంగ్లా), అబ్బాయి పాలెం గ్రామాలలో పర్యటించింది,ఈ సందర్భంగా జరిగిన సభలో వీరయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఒక వైపు ప్రజా సంక్షేమం వల్లిస్తూనే 11 సంవత్సరాల పాలనలో బడా కార్పొరేట్ సంస్థలకు రూ: 16 లక్షల కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చిందని చివరికి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఆదాని అంబానీ వంటి బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టడం సిగ్గుచేటు అన్నారు. అత్యంత ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్ లను అమలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక విద్యుత్ సవరణ చట్టం, విత్తన బిల్లు, వి బి జి రాంజీ చట్టం నల్ల చట్టాలను తీసుకొచ్చిందన్నారు. గత 40 సంవత్సరాలుగా పోరాడు సాధించుకున్న చట్టాలను, మూడు గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం తునాతునకలు చేసి విజయం సాధించినట్టు గొప్పలు చెప్పుకోవటం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. భారత ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చేలాంటి చట్టాలు అమలు చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని వారికి అండగా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఉన్నాయన్నారు .పెట్టుబడుదారుల మోచేయి నీళ్లు తాగుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాలపై ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు.భీమా రంగంలోకి 100% విదేశీ పెట్టుబడులకు అనుమతి అనురంగంలోకి ప్రవేట్ కంపెనీలకు విచ్చలవిడిగా అనుమతినిస్తూ అనుచట్టం చేసిందని ఆరోపించారు. వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాలని సంకల్పంతో కార్మిక ట్రేడ్ యూనియన్,రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘంల ఆధ్వర్యంలో జనవరి 7 నుండి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో నిరసన ఆందోళన నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 8 నుండి 18వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు గ్రామాలను కలుస్తూ జీబు జాతాను నిర్వహిస్తు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో నేడు జిల్లా కేంద్రంలో జరిగే భారీ ప్రదర్శన, బహిరంగ సభను విజయవంతం చేయాలని వీరయ్య కోరారు. ఈ సభలలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గునిగంటి రాజన్న, నల్లపు సుధాకర్, సిఐటియు జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి, అబ్బాయిపాలెం సిపిఎం వార్డు సభ్యురాలు నందిపాటి ఉప్పలమ్మ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బాణాల రాజన్న,రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కందాల రమేష్, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ఉపాధ్యక్షులు జిన్న లచ్చయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా నాయకులు కొండ ఉప్పలయ్య,వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్,కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు బోడపట్ల రాజశేఖర్,ప్రజా సంఘాల నాయకులు నందిపాటి వెంకన్న, తాటికొండ అనంతచారి, జినక సైదులు,జామ్మూర్తి, ఆల్లి శ్రీనివాస్ రెడ్డి,బయ్య సురేష్,నరేష్,ఎర్ర ఎంకన్న, జినక రామ్మూర్తి, తదితరులు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: