Monday, 14 September 2026 04:43:05 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు..

Date : 23 January 2026 06:58 PM Views : 325

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం తో పాటు ఇతర దేవాలయాల్లో శుక్రవారం వసంత పంచమి మరియు శ్రీ పంచమి వేడుకలను శాస్త్ర యుక్తంగా వేద పండితులు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్ల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా జరుపుకున్నారు. 20 సంవత్సరాలకు ఒకసారి వచ్చి వసంత పంచమి శుక్రవారం వస్తుందని పెద్దలు తెలిపారు. అనంతరం వందలాది మంది చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. సరస్వతీ హోమం చేసిన తర్వాత చిన్నారులకుఅక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. మాఘ మాస శుక్ల పక్ష పంచమి తిథిన జరుపుకునే వసంత పంచమి రోజున ప్రకృతి అంతా నూతన ఉత్సాహంతో కళకళలాడుతుంది. ఇదే రోజు సరస్వతి దేవి అవతరించిందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ పర్వదినాన్ని విద్యారంభానికి శ్రేష్ఠమైన దినంగా భావిస్తారు. సర్వస్వతీ అమ్మవారి ఆలయాల్లోనే కాకుండా నివాసాలు, విద్యాలయాల్లోనూ చదువుల తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

వసంత పంచమి రోజున చేసే కార్యాలకు పంచాంగ దోషాలు ఉండవని శాస్త్రాలు చెబుతున్నాయి. పిల్లలు చదువులో రాణించేందుకు నేడు అక్షరాభ్యాసం చేయిస్తారు. సంగీత, కళా శిక్షణ ప్రారంభం చేయడం వల్ల చిన్నారులకు జ్ఞానం, బుద్ధి, వాక్చాతుర్యం లభిస్తాయని నమ్మకం. చాలా విద్యాలయాల్లో సరస్వతీ పూజలు చేయడంతోపాటు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి చిన్నారులకు పెన్నులు, పలకలు, పుస్తకాలు పంచిపెడతారు. ఈ రోజు ఈ విధంగా చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. పిల్లలకు చిన్నతనం నుండి మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించడం వల్ల పిల్లలు మంచి పౌరులుగా తయారవుతారని ఉద్దేశంతో జరిపినట్లు పలువురు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :