ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది.ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ త్వరలో అందుబాటులోకి రానుంది. టికెట్ బుకింగ్‌ను వేగవంతం చేయడానికి క్యాప్చా ధృవీకరణను తొలగించారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో పూర్తిస్థాయి వెబ్‌సైట్ ప్రారంభం కానుంది. కొత్త వ్యవస్థలో నిమిషానికి 1.5 లక్షలకు పైగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు, ఇది ప్రస్తుత 32 వేల సామర్థ్యం కంటే చాలా ఎక్కువ. విచారణల సామర్థ్యం కూడా 4 లక్షల నుంచి 40 లక్షలకు పెరగనుంది. వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఏఐ సాంకేతికతను ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు నుంచి దశలవారీగా ఈ వెబ్‌సైట్ ప్రారంభం కానుంది.
Admin
E Nivas News