Tuesday, 15 September 2026 04:00:58 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ధాన్యం కొనుగోళ్లలో అవినీతికి పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు

చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సి. ఎస్.) శశిధర్ రాజు

Date : 30 October 2025 07:05 PM Views : 310

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేస్తుందని, ఈ ప్రక్రియలో అవినీతికి పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సి.ఎస్.) శశిధర్ రాజు తెలిపారు. 2024- 25 రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జిల్లాలోని జైపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో గురువారం డిసిఎంఎస్ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో పాటు అవకతవకలలో భాగస్వామ్యులైన రామారావు పేట గ్రామంలోని సుముఖ ఆగ్రో ఇండస్ట్రీస్ యజమానులు, మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణాధికారి, 8 మంది రైతులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ లపై రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళ జైపూర్ పోలీస్ స్టేషన్ లో 316 క్లాస్ 5, 318 క్లాస్ 4 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ కేసులో 1 కోటి 39 లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారని, జిల్లాలో 740 ఎకరాలలో 6 వేల 322.6 క్వింటాళ్ల ధాన్యమును 8 మంది రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి 1 కోటి 39 లక్షల రూపాయలు జమ చేసినట్లుగా ఆన్లైన్ ప్యాడి ప్రొక్యూర్ మెంట్ మేనేజ్మెంట్ సిస్టం లో తప్పుడు సమాచారాన్ని నమోదు చేశారని, వీటితో పాటు రవాణా ఖర్చుల కింద 1.90 లక్షల రూపాయల ట్రక్ చిట్టీలు సృష్టించి నమోదు చేశారని తెలిపారు. జైపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందని, పోలీసు శాఖ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓ.ఎస్.డి. శ్రీధర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ అజయ్ బాబు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :