Thursday, 30 July 2026 12:29:32 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

జాతీయస్థాయి బేస్ బాల్ పోటీలకు విజ్ డమ్ విద్యార్థిని ఎంపిక..

Date : 25 May 2026 09:10 AM Views : 100

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని విజ్ డమ్ హై స్కూల్ కు చెందిన ఏ. చందన విద్యార్థిని సబ్ జూనియర్ బేస్ బాల్ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికైనట్లు జిల్లా బేస్ బాల్ కార్యదర్శి అర్జున్ ఆదివారం తెలిపారు. చందన ఒరిస్సా రాష్ట్రం లోని భువనేశ్వర్ లో ఈనెల 24 నుండి 28వ తేదీ వరకు నిర్వహించే జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు.పదవ తరగతికి చెందిన చందన అనే విద్యార్థిని జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అత్యున్నత ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో తెలంగాణ రాష్ట్రం నుండి పాల్గొనడం గర్వకారణమని పాఠశాల డైరెక్టర్ జావేద్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు కేవలం చదువులోనే కాకుండా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో వివిధ రకాల క్రీడల్లో జాతీయ స్థాయి కోచ్ లచే శిక్షణను అందించడం జరుగుతుందని తెలిపారు. గతంలో సైతం పారా అథ్లెటిక్స్ లో జాతీయ స్థాయి క్రీడల్లో ఈ పాఠశాల విద్యార్ధి రాణించడం విశేషం.జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరిచి అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని, భవిష్యత్తులో పోలీస్ అధికారినిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడం తన లక్ష్యమని కుమారి చందన తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థినిని, శిక్షణను అందించిన కోచ్ అన్వేష్ ని పాఠశాల డైరెక్టర్ జావేద్, కరస్పాండెంట్ జహంగీర్, వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, అకాడమిక్ అడ్వైజర్ నాజియా ఇక్బాల్, ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ ఫహీం సుల్తానా, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, రియాజ్, రాజేష్, మధు, పృద్వి లతోపాటు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :