Saturday, 12 September 2026 10:40:09 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్...

ఇద్దరికి చోటు దక్కనుంది..

Date : 07 August 2026 09:11 PM Views : 110

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ దఫాలో ఖాళీగా ఉన్న రెండు బెర్తులను భర్తీ చేయడంతోపాటు ప్రస్తుత మంత్రుల శాఖల మార్పునకు అకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, కేబినెట్ నుంచి ఒకరికి ఉద్వాసన పలుకుతారని గతంలో ప్రచారం జరిగినప్పటికీ ప్రస్తుతం ఆమేరకు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం అందరిలో ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ విస్తరణకు అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే ఈ దఫాలో ఖాళీగా ఉన్న రెండు బెర్తులను భర్తీ చేయడంతో పాటు ప్రస్తుత మంత్రుల శాఖల మార్పునకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండు బెర్త్ లలో ఎస్టీ, రెడ్డి సామాజిక వర్గాల వారికి చాన్స్ దక్కే అవకాశం ఉంది. ఎస్టీ సామాజిక వర్గం నుంచి రేసులో రామచంద్రు నాయక్, బాలు నాయక్ లు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఒకరికి మంత్రి పదవి దక్కేఅ వకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపురెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, సుందర్శన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ కేబినెట్లో ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ కొనసాగుతున్నారు. అయితే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి కేటాయించాలని స్థానిక నేతలు కోరుతున్నారు. అధిష్టానం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాధాన్యం ఇస్తే.. ఆ జిల్లాకు చెందిన మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలలో ఎవరికో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రేసులో సుందర్శన్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మరో పది రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ పూర్తవుతుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటుండగా వీరిలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఈసారి మంత్రి వర్గ విస్తరణలో భాగంగా ప్రస్తుత కేబినెట్‌లో కొనసాగుతున్న వారిలో ఒకరికి ఉద్వాసన పలికే అవకాశాల ఉన్నట్లుగా ఇటీవల కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే, ఇప్పుడు అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. ఒకవేళ ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న ఒకరికి ఉద్వాసన పలికితే అదే సామాజిక వర్గం నుంచి మరొకరికి చాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: