Tuesday, 28 July 2026 09:26:30 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా సత్యనారాయణ

Date : 28 October 2025 07:06 PM Views : 316

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లక్షెట్టిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా గాండ్ల సత్యనారాయణను మంగళవారం ఎన్నుకున్నారు. అనంతరం సత్యనారాయణ ను జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ కక్షిదారులకు సేవలందించే క్రమంలో బార్ అసోసియేషన్ మార్గదర్శకంగా ఉండాలన్నారు. పెండింగ్ కేసులను వీలైనంత మేరకు న్యాయవాదులురాజీ మార్గం ద్వారా పరిష్కారమయ్యేలా కృషి చేయాలని సూచించారు. కాగా, గత బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కొమిరెడ్డి సత్తన్న కు, గాండ్ల సత్యనారాయణకు సమాన ఓట్లు పోల్ కావడంతో నిబంధనల మేరకు ఆరు నెలల చొప్పున పదవీ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగానే గాండ్ల సత్యనారాయణ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారని తెలిపారు. నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సత్యనారాయణ తనకు సహకరించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. బార్ అసోసియేషన్ ఆదర్శంగా ఉండేలా తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీపీ అజయ్ కుమార్, మాజీ అధ్యక్షులు కొమిరెడ్డి సత్తన్న, ఎలక్షన్ కమిషనర్ గోవిందరావు, ఏజీపీ బి సంతోష్, వైస్ ప్రెసిడెంట్ నలినీకాంత్, జనరల్ సెక్రెటరీ ప్రదీప్ కుమార్, జాయింట్ సెక్రెటరీ ఎన్ సత్య గౌడ్, న్యాయవాదులు రాజేశ్వరరావు, భూమారెడ్డి, సురేందర్, శ్రీధర్, కిరణ్ కుమార్, రవీందర్, రవికుమార్, జి పద్మ, రహమతుల్లా, రాజేశ్వర్, సదాశివ్, శివశంకర్, గణేష్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :