ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హమాలీల శ్రమను దోచుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని, ప్రభుత్వాలు మారుతున్న హమాలీ కార్మికుల బతుకులు మారడం లేదని, ఆరోపిస్తూ సోమవారం హమాలీలు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి గోలి ప్రకాష్ మాట్లాడుతూ హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని అలాగే ప్రమాద బీమా 25 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. హమాలీల శ్రమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని నిరసిస్తూ ప్రజావాణిలో మంచిర్యాలజిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ ( సిఐటియు) జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు చేయాలన్నారు.ప్రమాద బీమా ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించడంతోపాటు ప్రమాద బీమా కూడా అందజేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సిఐటి తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
Admin
E Nivas News