ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తే సిరిపూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. మంగళవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు నిర్మాణంతో తూర్పు ఆదిలాబాద్ జిల్లా సస్యశ్యామలం అవుతుందని, గత 3 సంవత్సరాలుగా అదిగో ఇదిగో అని రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడం విచిత్రంగా ఉందని తెలిపారు. ఒక్క కౌటాల మండల గ్రామ పంచాయతీలకు 16వ ఆర్థిక సంఘం నుండి రూ.17.5 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని, దానికి అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయాల్సిందే అని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం జీపీలకు తన వాటా ఇవ్వకుండా కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామపంచాయతీలు నడుస్తున్నాయని తెలిపారు. కౌటాల మండల కేంద్రంలో మినీ స్టేడియం అభివృద్ధి, నూతన శాఖా గ్రంధాలయ భవనం మరియు మెయిన్ రోడ్ ను సిసి రోడ్డుగా మార్చడం తదితర పనులుచేపట్టనున్నామని తెలిపారు. మండలంలో లో వోల్టేజ్ మరియు లోడ్ షెడ్డింగ్ సమస్య ఉన్నదని సర్పంచులు తమ దృష్టికి తీసుకొచ్చారని, విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విటల్, ఎంపీడీవో ప్రసాద్, తాసిల్దార్ ప్రమోద్ కుమార్, సింగల్ విండో చైర్మన్ మాంతయ్య, కాగజ్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్ధల దేవయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News