ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ లోఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సంబంధించిన నోటీసును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు అందజేశారు. ఈ బిల్లుతో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతించాలని స్పీకర్‌ను కోరారు. అసెంబ్లీ సెక్రటరీకి కూడా నోటీసులు అందజేశారు. కేటీఆర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
E Nivas News