ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : గత వారం రోజులుగా మంథని క్రీడా మైదానంలో టి ఫైబర్, డ్రీమ్ స్టార్ట్ రైస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ క్రీడా పోటీల్లో ZPHS గుంజపడుగు పాఠశాల విద్యార్థులు ఘన విజయం సాధించారు. కబడ్డీ, కోకో, క్యారమ్, చెస్ లలో విజయం సాధించి గ్రౌండ్ గేమ్స్ లో మండల ఓవరాల్ చాంపియన్షిప్ ను కైవసం చేసుకున్నారు. శ్రీ లక్ష్మీ భారతి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేయగ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు,మండల విద్యాధికారిణి దాసరి లక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ సమ్మయ్య , ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
Admin
E Nivas News