ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బీఆర్ఎస్, బీజేపీతో అభివృద్ధి జరగదని, కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తేనే మంచిర్యాల జిల్లాలక్షెట్టిపేట మున్సిపాలిటీ అభివృద్ధిచెందుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. సోమవారం మున్సిపల్ ఎన్నికల చివరి రోజైన సోమవారం పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచార సభలు నిర్వహించారు. ఏ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లక్షెట్టిపేటలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని, రెండులో బీఆర్ఎస్, మూడోవార్డుల్లో బీజేపీ ఒప్పందం కుదుర్చుకుని పోటీ చేయడం లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినా అభివృద్ధి చేయలేరని పేర్కొన్నారు. 15 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధికి చిరునామాగా లక్షెట్టిపేటను తీర్చిదిద్దుతానన్నారు. గత పాలకులుచేయలేని ఎన్నో పనులను తాను రెండేళ్లలో చేశానని తెలిపారు. ముఖ్యంగా ఇటిక్యాల ప్రజలు సంతోషంతో కాంగ్రెస్ కు ఓటేయ్యాలన్నారు. ఛైర్పర్సన్ అభ్యర్థి దొంత అంజలి, నర్సయ్య, వైస్ చెర్మన్ చెల్ల నాగభూషణం, గోళ్ళ కాంతయ్య లను భారీ మెజారిటీతో గెలిపంచాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సత్యపాల్ రావు, చెల్ల నాగభూషణం, గడ్డం త్రిమూర్తులు, పింగళి రమేష్, దొంత నర్సయ్య, ఛైర్పర్సన్ అభ్యర్థి దొంత అంజలి, కట్ల చంద్రయ్య, పెట్టెం శ్రీనివాస్, తొగరు రాజు, పెట్టెం కొమురయ్య, మెట్టుపల్లె సత్యం, కండె మొగిలి, కోల తిరుమలేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News