ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా మంగళవారం స్టార్ ఫంక్షన్ హాల్ లో పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్సై మధుకర్ ఆధ్వర్యంలో తల సేమియా జిల్లా కోఆర్డినేటర్ ఆడ వెంకటేష్ నేతృత్వంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి జిల్లా ఏఎస్పీ చిత్తరంజన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి రక్తదానం చేసిన వారికి ప్రోత్సాహకా సర్టిఫికెట్లను అందించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్ రక్తదానం చేసిన అనంతరం మాట్లాడుతూ రక్తదానం చేద్దాం దాన దాతలు అవుదామన్నారు. రక్తదానం చేయడం వలన మానవ శరీరం ఆరోగ్యకరంగా ఉంటుందని రక్తదానం 17వ సారి చేశాను అని తెలిపారు. రక్తదానం చేయడానికి యువకులు ముందుకు రావాలని, ప్రాణదాతలు కావాలని మరియు రక్తదానం చేసి ఆరోగ్యకరంగా బలంగా కావడానికి ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేరామేరి మండల వ్యాపారస్తులు యువకులు స్వచ్ఛందంగా పాల్గొనడం చాలా అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు జరిపి రక్తహీనత మరియు రక్తం లేని వారికి రక్తం ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. రక్తం ఇచ్చిన వారి ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుందని ఈ సందర్బంగా పలువురు పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులతో పాటు ఆదివాసి నాయకులు, స్థానిక వ్యాపారస్తులు మండల యువత , మండల ప్రజా సంఘాల నాయకులు యువజన సంఘాలు పాల్గొన్నారు.
Admin
E Nivas News