Monday, 14 September 2026 06:32:14 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

విద్య విప్లవానికి నాంది పలికిన మహనీయులు జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే

Date : 03 January 2026 05:58 PM Views : 237

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : భారత సమాజంలో విద్య విప్లవానికి నాంది పలికిన మహనీయులు జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే అని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం, కన్నెపల్లి మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విశిష్ట సేవలను స్మరించుకుంటూ ఏర్పాటు చేసిన విగ్రహాలను గడ్డం వంశీకృష్ణ ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల విద్య, దళితుల హక్కులు, సామాజిక సమానత్వం కోసం వారు చేసిన పోరాటం నేటి తరాలకు మార్గదర్శకమని, వారి ఆలోచన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం, విద్యా అభివృద్ధే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఎంపీ అభిప్రాయపడ్డారు. అలాగే కన్నెపల్లి ప్రాంత అభివృద్ధి కోసం అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మాలే కులాన్ని ఎస్టీ (ST) జాబితాలో చేర్చే అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించి న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తానని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మాలే కులం బీసీ–డీ (BC-D) జాబితాలో ఉండటంవల్ల ఉద్యోగాలు, రిజర్వేషన్లలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలే కులం ఇప్పటికే ఎస్టీ జాబితాలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ, అదే తరహాలో తెలంగాణలోనూ న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దీపక్, ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :