ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : భారత తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం పోలీసుల ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీని నిర్వహించారు. పాత బస్ స్టాండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహం నుంచి ఉత్కూర్ చౌరస్తా వరకు రెండు కిలోమీటర్ల రన్ నిర్వహించారు. అనంతరం సర్ధార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. పటేల్ జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ రమణ మూర్తి, ఎస్సై సురేష్, పోలీస్ సిబ్బంది, వాకింగ్ సభ్యులు, యువజన సంఘాల, నాయకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
E Nivas News