Saturday, 13 June 2026 01:18:06 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

కల్లు గీత వృత్తి లో ఆధునిక ఉపాధి కల్పించాలి

Date : 18 October 2025 10:29 AM Views : 345

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / సిరోల్ : మహబూబాద్ జిల్లా సిరోల్ మండల కేంద్రంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం సిరోల్ మండల సభకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌనీ వెంకన్న, జిల్లాలో కల్లు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న 25 వేల కుటుంబాల ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు 5 వందల కోట్లు కేటాయించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌనీ వెంకన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తరతరాల నుండి కల్లుగీత వృత్తి చేస్తూ ప్రభుత్వానికి వేలాది కోట్ల పన్నులు చెల్లించారు కానీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గీత కార్మికుల సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు. అతి ప్రమాదకరమైన కల్లుగీత వృత్తి చేస్తున్న గీత కార్మికులందరికీ ఎలాంటి రాజకీయ ఒత్తిడిలేకుండా ప్రమాదాలు నివారించుటకై సేఫ్టీ కిట్లు అందించాలని. స్వయం ఉపాధి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కల్లుగీత కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. ప్రభుత్వ లిక్కర్ పాలసీ వలన రోజు రోజుకి వృత్తి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం లిక్కర్, బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారిస్తూ గీత కార్మికుల వృత్తిని, ఉపాధిని దెబ్బతీస్తుందని అన్నారు. ప్రతీ సొసైటీకి 5 ఎకరాల భూమి, కల్లుకు మార్కెట్ సౌకర్యం నీరా తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమను త్వరగా ప్రారంభించి యువతి, యువకులకు, కల్లుగీత కార్మికులకు ఉపాధి కల్పించాలని కల్లుగీత వృత్తి చేస్తున్న ప్రతి ఒక్కరికి మోటార్ బైక్ లు ఇవ్వాలని, కల్లుగీత వృత్తిదారులకు గీతన్న బంధు పేరుతో 10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెన్షన్ ఐదు వేలకు పెంచాలని మెడికల్ బోర్డు నిబంధన తొలగించాలని, అర్హులైన వారందరికీ సభ్యత్వం, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. జిల్లా అధ్యక్షులు యమగాని వెంకన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సొసైటీ కి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని, బెల్టు షాపులను నిరోధించాలని, సొసైటీలో కమ్యూనిటీ భవనాలు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషియోను తక్షణమే విడుదల చేయాలని , కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిరోల్ మండల కేంద్రంలోని నగేష్ ఫంక్షనల్ లో జరిగిన మహాసభలో గునిగంటి మల్లయ్య అధ్యక్షత వహించిన మహాసభల్లో జిల్లా అధ్యక్షులు యమగాని వెంకన్న, ప్రధాన కార్యదర్శి గౌని వెంకన్న, నూతన కమిటీ ప్రకటించారు. సిరోల్ మండల అధ్యక్షులు గునిగంటి మల్లయ్య, ఉపాధ్యక్షులు బట్టు వెంకన్న మండల ప్రధాన కార్యదర్శి రెడ్డి మల్ల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి ఉడుగుల వీరన్న, కమిటీ సభ్యులు రెడ్డి మల్లఉపేందర్, ఉడుగుల వీరన్న, పెద్ది మల్లయ్య, పెద్ది అనిల్, గంధసిరి రాజు, గంధసిరి రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :