ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లక్షెట్టిపేట మండలం సూరారం గ్రామ స్టేజి జాతీయ రహదారి పక్కన మంగళవారంట్రాక్టర్ అతివేగంగా వచ్చి ఢీకొట్టగా 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెలు మహబూబ్ నగర్ జిల్లా నారాయణఖేడ్, గజ్జలప్పకు చెందిన 30 గొర్రెలు మృత్యువాత పడడంతో ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు నాలుగు లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఆందోళన చెందాడు. జాతీయ రహదారి పక్కన ఈ సంఘటన చోటు చేసుకోవడంతో రోడ్డుకి ఇరువైపులా వెళ్తున్న వాహనదారు లు వాహనాలు ఆపగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
Admin
E Nivas News