ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్‌పర్సన్ నిర్మల జగ్గా రెడ్డితో కలిసి, కాకా వెంకటస్వామి మెమోరియల్ టీ 20 క్రికెట్ లీగ్‌లో భాగంగా ఆదిలాబాద్ – ఖమ్మం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, సంగారెడ్డి జిల్లా – సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని చిమల్దారి కోనాపూర్ గ్రామంలో ఉన్న క్రికెట్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ యువతలో క్రీడల ద్వారా క్రమశిక్షణ, జట్టు స్పూర్తి, ఆరోగ్యకరమైన పోటీ భావన పెంపొందుతాయని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా జిల్లా స్థాయి క్రీడా ప్రతిభను వెలికితీయడంలో ఇలాంటి టోర్నమెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంటూ, టోర్నమెంట్ నిర్వాహకులను అభినందించారు. కాకా వెంకటస్వామి మెమోరియల్ టి 20 లీగ్ యువతను క్రీడల వైపు ఆకర్షించి రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ, పాల్గొంటున్న అన్ని జట్ల ఆటగాళ్లకు ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, టి జి ఐ సి సి చైర్‌పర్సన్ నిర్మల జగ్గా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ అధికారులు, నిర్వాహకులు, క్రీడాభిమానులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
E Nivas News