ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. 'చట్టబద్ధంగా నడుచుకునే సంస్థ హైడ్రా అన్నారు.న్యాయ వ్యవస్థపై పూర్తి గౌరవం ఉందన్నారు. కోర్టులకు కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నారని తెలిపారు . ఒకచోట భూమి చూపిస్తూ మరోచోట కబ్జా చేస్తున్నారని తెలిపారు . ప్రైవేట్ భూముల్లోని పార్కుల స్థలంలోనే హైడ్రా బోర్డులు ఉంటాయన్నారు . రూ.లక్షన్నర కోట్ల విలువైన 3,350 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడమన్నారు. 25 చెరువులను పునరుద్ధరిస్తున్నాం అన్నారు. మంచి పనులు చేస్తే ఎవరికైనా ఆటంకాలు ఏర్పడడం సహజమని తెలిపారు. అయినా కూడా న్యాయ వ్యవస్థపై నాకు పూర్తిగా నమ్మకం ఉందని తెలిపారు.
Admin
E Nivas News