ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : రామగుండం ప్రాంతంలో ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ ఏర్పాటు కోసం గత రెండు సంవత్సరాలుగా జరుపుతున్న కృషిని మరో ముందడుగుకు తీసుకెళ్లినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం తెలిపారు. విషయం పై అనేకసార్లు సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు ని ప్రత్యక్షంగా కలిసి మాట్లాడిన విషయాన్ని ఎంపీ గుర్తుచేశారు. మొదట ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిశీలించిన సైట్‌లో కొండలు ఉండటం, అడ్డంకులు ఉండటం వల్ల వారు ఆ లొకేషన్‌ను రిజెక్ట్ చేశారన్నారు. మేము మళ్లీ వారిని ఒత్తిడి చేసి, ప్రీ-ఫీజిబిలిటీ స్టడీని కొత్త లొకేషన్‌పై నిర్వహించేలా చర్యలు తీసుకున్నా మన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రూ. 50 లక్షలు ప్రీ-ఫీజిబిలిటీ స్టడీ కోసం సెంటర్‌కు చెల్లించినట్లు ఎంపీ తెలిపారు. ఈ స్టడీని వేగవంతం చేయడానికి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో మంత్రి రామ్మోహన్ నాయుడును మరోసారి కలిసి చర్చలు జరిపినట్లు వంశీకృష్ణ వెల్లడించారు. వారు నాకు హామీ ఇచ్చారన్నారు. డిసెంబర్ 3 లేదా 4 తేదీలలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టీమ్ రామగుండం ప్రాంతాన్ని సందర్శించి, కొత్త ల్యాండ్ సర్వే చేస్తుం దన్నారు. ప్రీ-ఫీజిబిలిటీ స్టడీ పూర్తయ్యాక భూసేకరణ, తుది నిర్ణయాలకు వెళ్లే అవకాశం ఉంటుంది," అని ఎంపీ చెప్పారు. ఎయిర్పోర్ట్ స్థాపన వల్ల రామగుండం, సింగరేణి ప్రాంతం, పెద్దపల్లి, ఆదిలాబాద్ మంచిర్యాల, జిల్లాలు సహా మొత్తం పరిసర ప్రాంతాల అభివృద్ధికి ఎంతో మేలు జరుగుతుందని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ఇది ఒక భారీ ఆర్థిక బారమనిఅవకాశాన్ని తీసుకొస్తుం దని అందరూ సహకరించా లన్నారు. మీ ఆశీర్వాదంతో రామగుండంలో ఎయిర్‌పోర్ట్ వచ్చేవరకు నేను నిరంతరం కృషి చేస్తానని ఎంపీ తెలిపారు.
Admin
E Nivas News