ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రం నుంచి ప్రభుత్వ భవనం లేకపోవడంతో ఐసీడీఎస్కార్యాలయం తరలిపోనున్నట్లు ప్రచురితమైన వార్తలకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పందించారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేమాట్లాడుతూ ప్రభుత్వ భవనం లేకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగించడానికి సిద్ధం అని అన్నారు. ఎవరు ఆందోళన చెందొద్దని అందరూ ధైర్యంగా ఉండలన్నారు. బోథ్ నుండి ఏ ఒక్క భవనం కూడాతరలిపోనివ్వనని భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడటం జరిగిందని, బోథ్ లో ప్రభుత్వ కార్యాలయాల కొరకు భవనాల ఇబ్బందులు ఉన్నాయన్నది వాస్తవం, నూతన భవనాల కొరకు అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందని, రూ. 12 కోట్లతో బోథ్ లో ఇంటిగ్రేటెడ్ కార్యాలయం కొరకు మంత్రి కిప్రతిపాదనలు సమర్పించడం జరిగిందని, మంత్రి కూడా తప్పకుండా మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వం భవనాలు మంజూరు చేయకపోతే ఎమ్మెల్యే అధికార నివాసంగా కేటాయించిన బోథ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రజల సౌకర్యాల కొరకు ప్రభుత్వ కార్యాలయాల కోసం అందిస్తానని హామీ ఇచ్చారు.అవసరమైతే రానున్న అసెంబ్లీ సమావేశాల్లో సైతం ఇంటిగ్రేటెడ్ కార్యాలయం కొరకు ప్రస్తావిస్తానన్నారు. ఎలాంటి పరిస్థితులోనైన ప్రజల పక్షానే ఉంటానని, ఏ ఆపద వచ్చిన అండగా నిలబడతానని, నియోజకవర్గ ప్రయోజనాల కోసం కష్టపడతానని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా బోథ్ నుంచి ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయం తరలిపోనివ్వనని అన్నారు.
Admin
E Nivas News