Friday, 11 September 2026 09:35:31 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

స్వాతంత్ర సాధనలో అమరుల త్యాగాలు అజరామరం..! రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు

Date : 15 August 2026 08:41 PM Views : 82

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : భారతదేశ స్వాతంత్ర సాధనలో అమరుల త్యాగాలు అజరామరమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) హర్కర వేణుగోపాల్ రావు అన్నారు. 80వ స్వాతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ లతో కలిసి హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతం, తెలంగాణ గీతాలాపనలో పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి సందేశాన్ని అందించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసి వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. జిల్లాలోని 892 స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన 100 కోట్ల 10 లక్షల రూపాయల బ్యాంకు లింకేజీ చెక్కును మంచిర్యాల జిల్లా సమాఖ్య సభ్యులకు అందజేశారు. పి.ఎం.ఎఫ్.ఎం.ఈ. పథకంలో 18 మంది లబ్ధిదారులకు 46 లక్షల 72 వేల 346 రూపాయల చెక్కును అందజేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. వేడుకలకు హాజరైన అధికారులు,ప్రముఖులు, మీడియా, ప్రజల కొరకు గ్యాలరీ, త్రాగునీరు, పారిశుద్ధ్యం ఇతర కార్యక్రమాల ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంబంధితఅధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: