ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదివాసి గిరిజన ఆడబిడ్డ ఊకే శిరీషపై అత్యాచారం చేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం కుమురం భీం చౌరస్తా లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి గోడిసెల కార్తీక్, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నేర్పల్లి అశోక్, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి నంది పద్మ లు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని వీటిని అరికట్టడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయని అన్నారు. ఆదివాసి గిరిజన మహిళపై జరిగిన ఈ దారుణం పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న దారుణాల పట్ల ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని అన్నారు. మహిళలకు రక్షణగా చట్టాలు ఎన్ని ఉన్నా వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆగటం లేదని అన్నారు. శిరీష కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాలు సి ఐ టి యు, ఐద్వా, టి.ఎ.జి.ఎస్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సంఘాలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రాజేందర్, సహాయ కార్యదర్శి శ్రీకాంత్, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుర్గం రాజ్ కుమార్, కోశాధికారి నిఖిల్ జిల్లా లోనీవివిధ ఆస్పత్రి నర్సులు తనుశ్రీ హిందూ. మేఘన రజిత బుజ్జి, శ్రావణి,సౌందర్య ,పావని, రతిక, జయశ్రీ. తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News