ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంగళవారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీనుబాబు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మంథని డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీమల సందీప్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మారగోని మహేష్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన అనంతరం సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించరు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల అందించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్ స్వర్గీయ మాజీ స్పీకర్ శ్రీపాదరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో రామ లక్ష్మణుల్లాగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఆయన సోదరుడు శ్రీను బాబులు ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సర్పంచ్ లు, నాయకులు అభిమానులు, మహిళా నాయకురాల్లు, యువ నాయకులు, భారీ సంఖ్యలో పా ల్గొన్నారు.
Admin
E Nivas News