ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అల్లు అర్జున్ ఫాన్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తమ్మనవేణి అంజి యాదవ్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ అక్బర్ నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గోగర్ల శ్రీకాంత్ మరియు తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బి. నందు,అల్లు అర్జున్ లు పాల్గొన్నారు. ఫ్యాన్స్ నిబంధనలు మంచి కట్టుబాట్లతో ముందుకు కొనసాగాలని మరియు సేవలు చేసుకుంటూ ఉండాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా లక్షెట్టిపేట మండలంకు సంబందించి అల్లు అర్జున్ అభిమానులను అఫీషియల్ గా చేర్చారు. సుమారుగా 50 మంది ఇందులో చేరారు. రాబోయే రోజులలో కూడా ఇంకా అల్లు అర్జున్ అభిమానులను చేర్చే అవకాశం ఉందని మహమ్మద్ అక్బర్ చెప్పారు.అల్లుఅర్జున్ ఫాన్స్ అసోసియేషన్ లక్షెట్టిపేట నుండి టౌన్ ప్రెసిడెంట్ గా తీగల రాకేష్ ని మరియు టౌన్ వైస్ ప్రెసిడెంట్ గా రాపెల్లి జయ చంద్ర ని ఆఫీషియల్ గా నియమించారు.తీగల రాకేష్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఈ పదవి నాకు ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లోసేవా కార్యక్రమల్లో ముందు ఉంటానని అల్లు అర్జున్ పేరు నిలబెడతానని మనస్పూర్తిగా హామీ ఇస్తున్నానన్నారు. నాకు సహకరించిన నా తోటి మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Admin
E Nivas News