Friday, 11 September 2026 10:26:21 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు..

మదర్ తెరిసా మహిళ పొదుపు సమితి ఛైర్మన్ మాదేశి పద్మ

Date : 29 August 2026 06:00 PM Views : 83

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఏలాంటి ఆధారాలు లేకుండా తమ సొసైటీ (సమితి) పై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని మదర్ తెరిసా మహిళ పొదుపు సమితి ఛైర్మన్ మాదేశి పద్మ పేర్కొన్నారు. శనివారం మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ (డబ్ల్యు జే)లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ మంథనిలో కొనసాగుతున్న మదర్‌ థెరిస్సా సహకార సమైక్య పొదుపు సంఘంపై నామని హరీష్‌ చేసిన ఆరోపణలను ఖండించారు. సొసైటీ మహిళలకు అమ్మలాంటిదని, మహిళల ఆర్థికాభివృద్ధి కోసం పారదర్శకంగా పనిచేస్తోందని, నామని హరీష్‌ తల్లి గౌరమ్మ సొసైటీ నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించాలని పలుమార్లు కోరినప్పటికీ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రుణం చెల్లించకుండా ఉండేందుకు సొసైటీపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అధిక వడ్డీలు, వడ్డీపై వడ్డీలు వసూలు చేస్తున్నామన్న ప్రచారంలో వాస్తవం లేదని సొసైటీకి సంబంధించిన ప్రతి లావాదేవీని రిజిస్టర్లలో నమోదు చేస్తున్నామని, 2022 నుంచి తమ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చెశారు. సొసైటీ కార్యకలాపాలపై ఏవైనా సందేహాలు ఉంటే కార్యాలయానికి వచ్చి సంబంధిత రికార్డులను పరిశీలించి నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే హరీష్‌ కోరిన సమాచారాన్ని సొసైటీ లెటర్‌హెడ్‌పై అధికారికంగా అందజేశామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సొసైటీని రచ్చకీడ్చేలా, అప్రతిష్టపాలు చేసేలా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. బ్లాక్‌మెయిల్‌, బెదిరింపులకు తాము భయపడబోమని, సొసైటీ ప్రారంభమైననాటి నుంచి నేటి వరకు జరిగిన లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారం రిజిస్టార్లలో నమోదు చేసి ఉందని మేనేజర్‌ మేకల మల్లేశం తెలిపారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు నామని సుగుణ, తాత మధునమ్మ, ముప్పిడి మల్లేశ్వరి, ఎలగందుల సరిత, పుల్లె రాజేశ్వరి, పుల్లే లక్ష్మి, కొండ కనకమ్మ, కట్కూరి శోభ, మాడం రమాదేవి, మాచిడి సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :