ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో / కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని కాపువాడ కాలనీలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం మహోత్సవం బుధవారం అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమానికి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి వేద పండితులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కోనప్ప ఈ సందర్భంగా మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గ, ప్రజలు, రైతులు సుభిక్షంగా, సుఖసంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని స్వామివారిని వెడుకున్నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తాజా మాజీ కౌన్సలర్ పిరిసింగుల జై చందర్ సీనియర్ నాయకులు చిలువేరు సత్యనారాయణ, కమల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News