ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మండలం కాన్సాయిపేట గ్రామానికి చెందిన జక్కుల అరుణ్ కుమార్ టి జి పి ఎస్ సి ద్వారా గ్రూప్ 1 సర్వీస్ కు ఎంపికై అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ గా నియామకం కాగా గ్రూప్ 2 లో కూడా డిప్యూటీ తహసిల్దారిగా ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022లో ఇచ్చిన గ్రూప్స్ నోటిఫికేషన్ తో గ్రూప్స్ కు సన్నద్ధమై గ్రూప్ 1, 2, 3 లలో ఉత్తమ ర్యాంకులు సాధించగా వెంకటాపూర్ సెక్టర్ అంగన్వాడి టీచర్లు వారి తోటి అంగన్వాడి టీచర్ కుమారుడు గ్రూప్ 1 ఉద్యోగం సాధించినందుకు గాను హర్షం వ్యక్తం చేస్తూ అరుణ్ కుమార్ ను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు హరిత, సంధ్య, రాజేశ్వరి, సత్తక్క, కనకలక్ష్మి, చంద్రకళ, లక్ష్మి, సృజన, మంగ, రాదాబాయి, సునీత, లలిత, రాజక్క, శ్యామల, స్వరూప, అనసూర్య లు పాల్గొన్నారు.
Admin
E Nivas News