ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ములుగు జిల్లాలో గల చారిత్రక ఆలయాన్ని సోమవారం జర్మనీ దేశస్థులు సందర్శించి పూజలు చేశారు.రామప్ప ఆలయం చరిత్ర ఎంతో గొప్పదని జర్మనీ పర్యాటకులు కొనియాడారు. జర్మనీ దేశానికి చెందిన కేబ్లిజ్ యంగ్, యులి స్టేయింబ్, చీకో స్ట్రాన్ లుసందర్శించారు. జర్మనీ దేశస్థులకు ఆలయ అర్చకులు హరిశ్ శర్మ, ఉమా శంకర్ లు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వారికి వివరించారు ఈ సందర్బంగా జర్మనీ దేశస్థులు మాట్లడు తూ బ్యుటిపుల్ టెంపుల్ రామప్ప అని అన్నారు. అనంతరం రామప్ప చెరువు సందర్శించి బోటింగ్ చేశారు. వారివెంట ఈవో ఇమ్మడి భాస్కర్, టూరిస్ట్ పోలిసులు, దేవాదాయ,పురావస్తు, టూరిజం శాఖల సిబ్బంది ఉన్నారు.
Admin
E Nivas News