Wednesday, 29 July 2026 07:18:37 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

కాటారం వేదికగా రేపు రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల...

రైతులకు రూ.5,653 కోట్ల పెట్టుబడి సహాయం..

Date : 19 April 2026 11:03 PM Views : 165

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలోని రైతులకు రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీకి రంగం సిద్ధమైంది. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరిపల్లి,లో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఐటి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, సమక్షంలో ల్యాప్ టాప్ బటన్ మీద నొక్కి ఈ నిధులను విడుదల చేయనున్నారు. రెండో విడత కింద 45, 11,947 మంది రైతుల ఖాతాల్లో రూ.2,063 కోట్లు జమకానున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో జరిగే బహిరంగ సభ నుంచే సీఎం ఈ నిధులను విడుదల చేస్తారు. రాష్ట్రంలో 73 లక్షల మంది రైతులు ఉన్నారు. యాసంగి రైతు భరోసా సాయం కింద మార్చి 23న ప్రతి రైతుకూ ఒక్కో ఎకరానికీ రూ.6వేల చొప్పున దాదాపు రూ.3,590 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు రెండో విడత కింద దాదాపు 36.72 లక్షల ఎకరాలకు చెందిన అన్నదాతలకు రైతు భరోసా అందనుంది. రెండు విడతల్లో కలిపి రైతులకు మొత్తం రూ.5,653 కోట్ల సాయం అందినట్లవుతుం దని వ్యవసాయ శాఖ వెల్లడించింది. మూడో విడత నిధులను వీలైనంత త్వరగా అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాగా, సీఎం రేవంత్‌ సోమవారం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనున్నారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కాటారం లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: