ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి మార్కండేయ కాలనీలో రెండు కుటుంబాల మధ్య ఆస్థి, వివాదాల కారణంతో కత్తి తో దాడి చేసి హత్యాయత్నం కి పాల్పడిన నిందితుని అరెస్ట్ చేసినట్లు శుక్రవారం ఏసీపీ కార్యాలయం లో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి తో కలిసి వెల్లడించారు. పోలీస్ అధికారులు తెలిపిన ప్రకారంవివరాల్లోకి వెళితే.. నిందితుడు గాడిచెర్ల రామ్ దూత్, 27 బిటెక్ చదివి ప్రస్తుతం సోరియాసిస్ చర్మ వ్యాధితో ఇంట్లోనే ఉంటున్నాడు. నిందితుని తాత రాయమల్లు కట్టించిన ఇంటిలో పెద్ద కుమారుడు సారయ్య కుటుంబం ఒక భాగంలో ఉండగా, చిన్న కుమారుడు శ్రీనివాస్ కుటుంబం మరో భాగంలో ఇద్దరు కుమారుల పక్కపక్కనే చెరో భాగంలో నివసిస్తున్నారు. శ్రీనివాస్ ఎనిమిది నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన భార్య సుమిత్రి, కుమారుడు ప్రణయ్ (22), కుమార్తె సువర్చలా, సుమిత్రి తల్లి కొమురమ్మ అక్కడే ఉంటున్నారు. నిందితుడు రామ్ దూత్ తండ్రికి ఫిట్స్, బీపీ సమస్యలు ఉండగా, తల్లికి గుండె సమస్యలు ఉన్నాయి. పిన్ని సుమిత్ర కిరాణా దుకాణంలో సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలా అమ్ముతుండగా, వాటి వాసన మరియు పొగ కారణంగా తమ ఆరోగ్యం దెబ్బతింటోందని రామ్ దూత్ కుటుంబం పలుమార్లు అభ్యంతరం తెలిపారు . ఈ విషయంపై తరచూ గొడవలు జరిగాయన్నారు. అదేవిదంగా నిందితుని రామ్ దూత్ తండ్రి, చిన్న నాన్న (బాబాయ్ ) కుటుంబ ఆస్తి తనకే వస్తుందని భావించి బాబాయ్ కుటుంబ సభ్యులను చంపాలని రామ్ దూత్ నిర్ణయించుకొని, గత సంవత్సరం అక్టోబర్ 5న అమెజాన్ ద్వారా కొబ్బరి కత్తి కొనుగోలు చేసిఇంట్లోదాచుకున్నాడు. హత్యకు గల కారణాలను ఒక నోట్ బుక్ లో కూడా రాసుకున్నాడు. నిందితుని పథకం లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున సుమారు ఉదయం 5 గంటల సమయంలో, పిన్ని సుమిత్ర నిద్ర లేచి , తలుపులు తీసి , బాత్రూం కు వెళ్లగా రామ్ దూత్ కత్తితో పక్కింట్లోని బాబాయ్ ఇంటికి వెళ్లి పడుకుని ఉన్న ప్రణయ్ పై ఛాతీ, భుజాలు, మెడపై దాడి చేశాడు. అరుపులువినిఅడ్డుకున్న కొమురమ్మకు ముఖం, చెవి, చేతిపై గాయాలు అయ్యాయి. తరువాత సుమిత్రిపై కూడా ముఖం, చేతులపై కత్తితో దాడి చేసి తీవ్ర గాయాలు చేశాడు. అరుపులు విని అక్కడికి వచ్చిన చుట్టూ ప్రక్కన వ్యక్తులు నిందితుడిని అడ్డుకుని కత్తి లాక్కొన్నారు. దాడి సమయంలో బట్టలపై రక్తం పడటంతో బట్టలు మార్చుకుని రామ్ దూత్ ఇంటి నుండి పారిపోయాడు. వారిని మొదట గోదావరిఖని గవర్నమెంట్ హాస్పిటల్ కు తర్వాత కరీంనగర్ వన్ ఆస్పత్రికి తీసుకుపోయి అడ్మిట్ చేశారు .నిందితుడు ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ వద్ద దాక్కొని బస్ స్టాండ్ కు వెళ్తున్నాడన్న నమ్మదగిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ ఇంద్రాసేనా రెడ్డి, అక్కడకి వెళ్లి నిందితుడిని పట్టుకొని అదుపులోకి తీసుకోని పోలీస్ స్టేషన్ తరలించి అరెస్ట్ చేసికోర్ట్ లో హాజరు పరిచి రిమాండ్ కి తరలించినట్లు ఏసీపీ తెలిపారు.
Admin
E Nivas News