Sunday, 13 September 2026 12:51:35 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

బాలికల, మహిళల రక్షణపై అవగాహన కల్పించిన షీ టీమ్ పోలీసులు

Date : 05 December 2025 11:17 PM Views : 305

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బాలికలు మహిళల రక్షణ పై షీ టీం పోలీసులు అవగాహన కల్పించారు. సిపి. అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలోని రెవెలేషన్ పాఠశాలలో శుక్రవారం శుక్రవారం మంచిర్యాల షీ టీమ్ ఎస్ ఐ ఉషారాణి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఉషారాణి మాట్లాడుతూ మహిళా భద్రత, బాలికల రక్షణ, వేధింపుల నివారణ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలపై జరిగే వేధింపులు, ఈవ్ టిజింగ్, సోషల్ మీడియాలో వేదింపులు, అసభ్య ప్రవర్తనలు వంటి ఘటనలను అరికట్టేందుకు షీ టీమ్ పోలీసులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు. అత్యవసర సమయం లి డయాల్ 100/112, 181 మహిళా హెల్ప్ లైన్ నెంబర్లను విద్యార్థులు గుర్తుంచుకోవాలని సూచించారు. పాఠశాల నుండి ఇంటికి వెళ్లే మార్గంలో ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు, వేధింపులు ఎదురైతే వెంటనే రామగుండం కమీషనరేట్ షీ టీమ్కు నెంబర్ 6303823700, మంచిర్యాల షీ టీమ్ నెంబర్ 8712659385 సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు తెలిపారు. సైబర్ వేధింపులపై బాధపడుతున్న బాలికలు తమ ఫిర్యాదులను పోలీసులకు తెలియజేయాలని, అన్ని రకాల ఫిర్యాదులను గోప్యంగా స్వీకరిస్తామని భరోసా కల్పించారు. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్టులు అంగీకరించ కూడదని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు. బాలికల భద్రత కోసం రామగుండం కమీషనరేట్ పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. మీలో ధైర్యం, అవగాహన పెంపు మా ప్రధాన లక్ష్యం. ఏ సమస్య అయినా వెంటనే పోలీసులకు తెలియజేయండి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా షి టీమ్ ఇంచార్జి ఎస్.ఐ. ఉషారాణి ,షి టీమ్ సిబ్బంది కానిస్టేబుల్ సతీష్, మహిళా కానిస్టేబుళ్లు శ్రీలత,శైలజ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కరస్పాండెంట్ విష్ణువర్ధన్ గారు,స్కూల్ టీచర్లు మరియు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :