Wednesday, 29 July 2026 07:19:39 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో ఆగష్టు 10న జైల్ భరో జయప్రదం చేయాలి..

సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజిరెడ్డి

Date : 23 July 2026 08:51 PM Views : 35

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కార్మిక, రైతు, వ్యవసాయం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్ర బీజేపీ విధానాలను ఎండగట్టాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారంమంచిర్యాల పట్టణంలోని పూలె భవనంలో గురువారం రోజున సీఐటీయు, రైతు, వ్యవసాయ కార్మిక, ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, ఆదివాసీల ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన ముఖ్య అతిధులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం స్వాతంత్ర రాకముందే పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి, దేశంలో పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు అనుకూలంగా వారికి లాభాలు చేకూర్చడం కోసమే లేబర్ కోడ్స్ ను బీజేపీ తెచ్చిందన్నారు కార్మికులకు కనీస వేతనం నిర్ణయం చేయలేదన్నారు.పని భద్రతను పని గంటలను పెంచిం దన్నారు. ఈపిఎఫ్, ఈఎస్ఐ ను ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్లకు అప్పచెప్పుతుంది. కార్మికుల మేడలకు లేబర్ కోడ్స్ ఉరితాళ్లుగా మారుస్తుం దన్నారు . కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం అమెరికా బ్రిటన్, న్యూజిలాండ్ లతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద్దాలు చేసుకుం దన్నారు . భారత వ్యవసాయ రంగంలోకి 32 దేశాలు నుండి దిగుమతులను ప్రోత్సహించడంతో జిరో సుంకంతో దిగుమతులు రావడంతో దేశియా వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గిపోయి రైతులు దివాళా తీసిందన్నారు .గత డిసెంబర్లో పత్తిపై ఉన్న 11 శాతం సుంకం తగ్గించి 40 లక్షల బేళ్ల పత్తిని అదనంగా దిగుమతి చేసుకోవడంతో దేశంలో పత్తి ధరలు పడిపోయాయన్నారు. వామపక్షాల పోరాట ఫలితంగా 2005లో “మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారంటీ చట్టం-2005" రూపొందిందని, దీనికి ప్రకారం వ్యవసాయ కార్మికులకు సం॥లో 100 రోజుల పని కల్పించాలన్నారు . ప్రస్తుతం రోజుకు రూ.308-లు చెల్లిస్తున్నారన్నారు . దేశంలో మొత్తం వ్యయంలో 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్రాలు భరించాలన్నారు. ఈ పథకానికి ఏటా 2.6 లక్షల కోట్లు పెంచాలని ఆందోళన జరుగుతుండగా కేంద్ర బిజెపి ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసిందన్నారు. మహాత్మాగాంధీ పేరు తొలగించి "వికసిత్ భారత్ గ్రామ్ జి" పేరు (విబిజి రామ్)గా మార్పు చేయడమే కాక, రాష్ట్రాల వాటా 10 శాతం నుండి 40 శాతం నిధులను భరించాలని నిర్ణయించడం తగదన్నారు. సమైక్య పోరాటం ద్వారా ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకో వాలన్నారు .గత పార్లమెంట్ సమావేశాల్లో “2025 విద్యుత్ సవరణ బిల్లు"గా ఆమోదించడం జరిగిందని, ఈ చట్ట ప్రకారం ఇక నుండి విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ బాధ్యతలు కేంద్రం చూస్తుందన్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టి టారిఫ్ ముందుగానే వసూలు చేస్తున్నారన్నారు. ఉచిత విద్యుత్ రద్దు చేస్తారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా విద్యుత్ ను ప్రైవేటీకరించం, మోటర్లకు మీటర్ బిగించం అని చెబుతున్నప్పటికీ, ఈ సంక్షోభం నుండి బయట పడేందుకు భవిష్యత్తో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడం లేదా చార్జీలు పెట్టడం (పెంచడం) వంటి నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉందన్నారు. ఈ ప్రక్రియ క్రమేపి విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడానికి మార్గం సుగమం చేయడమేనని, దీనిని నిలువరించేందుకు ప్రజలు ఆందోళనలోకి రావాలన్నారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఆగస్టు 10న జరుగు జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు రైతు, వ్యవసాయ కార్మికసంఘం-ఆదివాసీ గిరిజన సంఘాల కోరుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా కార్యదర్శి, గోమాస ప్రకాష్ సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు, సాంబారి వెంకటస్వామి, దాగం రాజారాం జిల్లా సహాయ కార్యదర్శులు, లక్ష్మణ్, రఫియా, దేవదాస్, రవి జిల్లా కమిటీ సభ్యులు, బోడేంకి చందు రైతు సంఘం జిల్లా కార్యదర్శి, కనికరపు అశోక్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, ఎర్మ పున్నం ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి, శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్, డుర్కే మోహన్ కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి, బ్రహ్మయ్య సవిత జయ మదునమ్మ సరిత రబియా రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :