Sunday, 13 September 2026 12:14:21 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

యువతకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం..! పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలతో కలిసి నిరసనలో పాల్గొన్నఎంపీ...

Date : 23 July 2026 08:53 PM Views : 73

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలకు నిరసనగా గురువారం పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేపట్టిన ఆందోళనలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, యువత హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్షలు పారదర్శకంగా, ఎలాంటి పేపర్ లీకేజీలు లేకుండా నిర్వహించాలని యువత చేస్తున్న న్యాయమైన డిమాండ్‌కు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి యువతను నిరాశపరిచిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగులు, పేపర్ లీకేజీల బాధితులు న్యాయం కోసం పోరాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ వారి తరఫునపార్లమెంట్‌లో గొంతెత్తుతోందని అన్నారు. అదేవిధంగా, తెలంగాణలోవిద్యార్థుల సమస్యలపై రాజకీయాలు చేయకుండా వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులపై కేసులు నమోదు చేయడం, వారిని తప్పుదోవ పట్టించడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా యువత సమస్యలపై స్పందించాలని, వారి అభిమానుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై బాధ్యతాయుతంగా మాట్లాడాలని పిలుపునిచ్చారు. చివరగా, యువతకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని, నిరుద్యోగుల హక్కుల సాధన కోసం తమ ఉద్యమం ఆగదని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: