Tuesday, 28 July 2026 09:33:17 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

కాంగ్రెస్ రెండేళ్ల పాలన తేలిపోయింది..!! ఆడబిడ్డలకు రూ.2500 ఎవరికైనా ఇచ్చారా

మాజీ మంత్రి డీఎస్ రెడ్యా నాయక్

Date : 18 January 2026 07:38 PM Views : 306

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : కాంగ్రెస్ రెండేళ్ల పాలన తేలిపోయిందని ఆరు గ్యారెంటీలు అటుకెక్కినట్లు మాజీ మంత్రి డీఎస్ రెడ్యా నాయక్ ఆరోపించారు. మరిపెడ మున్సిపల్ కేంద్రం లోని పాలు వార్డులలో ఆయన పార్టీ పట్టణ అధ్యక్షులు ఉప్పల నాగేశ్వర రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు తో కలిసి ఆయా వార్డుల ప్రజలు , పార్టీ శ్రేణులతో మాట్లాడారు. రెండేళ్ల పాలన ఎలా ఉందో ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. కళ్యాణ లక్ష్మి (తులం బంగారం) ఎంత మందికి అందిందని...? ప్రతి ఇంటి ఆడబిడ్డకు రూ.2500లు? ఆసరా పింఛన్లు రూ, 4వేలు, అంగవైకల్యం కలిగిన వారికి రూ.6000వేలు ఎక్కడైనా ఇచ్చారా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. దీంతో మహిళలు లేదంటూ సమాధానం ఇచ్చారు. రైతు బంధు పథకం రూ.15000వేలు ఇవ్వటం లేదని పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని రెడ్యా నాయక్ విచారం వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల పాలన లో కాంగ్రెస్ తన అసమర్ధత ను నిరూపించుకున్నారు. అధికారం కోసం అలవికాని 420 హామీలు ఇచ్చి అమలు చేయలేక అపసో పాలు పడుతుందన్నారు.డోర్నకల్ నియోజక వర్గం స్థానికేతురుల పాలన లో వెనుకబాటుకు గురైందని విచారం వ్యక్తం చేశారు. మరిపెడ పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్న దృడ సంకల్పంతో పురపాలక కేంద్రం గా ఏర్పాటు చేసి కోట్లాది నిధులు మంజూరి చేసి సుస్థిరమైన ప్రగతి సాధించేలా కృషి చేసినట్లు తెలిపారు.మరిపెడ పట్టణ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి మంజూరి చేయించి అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తో శంకు స్థాపన చేయించినట్లు పేర్కొన్నారు. మరిపెడ కు సబ్ కోర్టుమంజూరి చేసి స్థల పరిశీలన చేశామని పేర్కొన్నారు. అనునిత్యం ప్రజలకు అందుబాటు లో ఉండి అభివృద్ధి లక్ష్యంగా పని చేశానని స్పష్టం చేశారు. డోర్నకల్ పరాయి పాలన లో అన్ని వర్గాల్లో వెనుకబాటుకు గురవుతుందని ఇది తనకెంతో ఆవేదన కలిగిస్తుందన్నారు. రానున్న పురపాలిక ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మన పాలన మనం చేసుకుందని ఓటర్లను అభ్యర్థించారు. అందుబాటు లో ఉండేది అభివృద్ధి చేసేది ఎవరో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఒడిఎమ్ఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి,మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న, జిల్లా నాయకులు గుగులోతు రాంబాబు, తేజావత్ రవీందర్ నాయక్, ఉగ్గంపల్లి సర్పంచ్ ఆయుబ్ పాషా, పానుగోతు వెంకన్న, జాటోత్ బాలాజీ, మాచర్ల భద్రయ్య, భానోత్ కిషన్, గుగులోతు తిరుపతి, శ్రీనివాస్, ఎల్వి వెంకన్న, సయ్యద్ లతీఫ్,మక్స్ ద్, రేఖా వేంకటేశ్వర్లు, దిగజర్ల శ్రీనివాస్, గణేష్, రేఖా ధర్గయ్య,వసంత్ ఫోటో గ్రాఫర్ నరేష్, వీరబాబు, కృష్ణ, బిఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :