ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ ముసాయిదా జాబితాను (డ్రాఫ్ట్ ) గురువారం మున్సిపల్ కమీషనర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విడుదల చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులకు సంబంధించిన ఓటర్ల వివరాలు నోటీసు బోర్డు లో పరిశీలనకు ఏర్పాటు చేశారు. పౌరులు తమ పేరు, ఫోటో, చిరునామా, లింగం మొదలైన వివరాలను జాగ్రత్తగా పరిశీలించి ఏమైనా తప్పులు ఉంటే అభ్యంతరాలను ఈ నెల 5 లోపు తెలిపాలని వివరించారు. కార్యాలయ పని దినాల్లో అభ్యంతరాలను తెలిపి సవరించుకునే అవకాశం ఉందన్నారు. అభ్యంతరాల అనంతరం రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 10 న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు,మేధావులు, ఓటర్లు సహకరించాలని మున్సిపల్ కమీషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News