ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : మొంథా తుఫాను నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం, పత్తి, మొక్క జొన్న కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలని, రైతులకు నష్టం జరగకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
Admin
E Nivas News